Showing posts with label movie reviews. Show all posts
Showing posts with label movie reviews. Show all posts

Friday, 9 December 2016

ధృవ మూవీ రివ్యూ రేటింగ్ మిరే చూసేయండి !!

నటీనటులు: రామ్చరణ్‌.. రకుల్ప్రీత్సింగ్‌.. అరవిందస్వామి.. పోసాని కృష్ణమురళి.. నాజర్‌.. నవదీప్తదితరులు 
                                         సంగీతం: హిప్హాప్తమిళ 
                                               కళ: నాగేంద్ర 
                                     ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్ 
                                           కూర్పు: నవీన్నూలి 
                              నిర్మాతలు: అల్లు అరవింద్‌, ఎన్‌.వి. ప్రసాద్ 
                                             దర్శకత్వం: సురేందర్రెడ్డి 
                                                  విడుదల తేదీ: 9-12-2016

మిళంలో విజయవంతమైన చిత్రాలు అనువాదాలుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అయితేతని ఒరువన్‌’ కథలో మాత్రం తాము నటించాల్సిందే అంటూ పలువురు కథానాయకులు ఆసక్తి చూపించారు. కథ మన పరిశ్రమని అంతగా ఆకర్షించింది. అందులో నటించే అవకాశం మాత్రం రామ్చరణ్కే లభించింది. తమిళంలో వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించినతని ఒరువన్‌’ రీమేక్లో రామ్చరణ్నటించడం, అది కూడామగధీరతర్వాత గీతాఆర్ట్స్లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దానికితోడు ప్రచార చిత్రాలూ ఆకట్టుకొనేలా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా సాగుతుందో లేదో తెలుసుకొందాం పదండి.
కథేంటంటే?:
 ధృవ (రామ్చరణ్‌)కి చిన్నప్పట్నుంచీ దేన్నైనా లోతుగా పరిశీలించడం అలవాటు. అలవాటుతోనే చిన్న చిన్న నేరాలన్నింటి వెనుక వ్యవస్థీకృత నేరం ఒకటి ఉంటుందని గ్రహిస్తాడు. తాను ఐపీఎస్కు ఎంపికయ్యాక శిక్షణలో ఉండగానే నేరాలపై పరిశోధన చేయడం మొదలుపెడతాడు. శిక్షణలో ఉన్నప్పుడే ధృవ, అతని బృందం బయట జరిగే చిన్న చిన్న నేరాల అంతు చూస్తుంటారు. ‘ఎవడిని కొడితే వందమంది క్రిమినల్స్అంతం అవుతారో వాడినే అంతం చేయాలనేలక్ష్యం పెట్టుకొన్న ధృవ ఐపీఎస్శిక్షణ పూర్తయ్యే క్రమంలోనే బలమైన శత్రువుని ఎంచుకొంటాడు. శత్రువే సిద్ధార్థ్అభిమన్యు (అరవింద్స్వామి). ఒక శాస్త్రవేత్త అయిన సిద్ధార్థ్ఎన్నో అక్రమాలకి పాల్పడుతుంటాడు. ఇండియాకి జనరిక్మందులు వచ్చే విషయంలో అడ్డు పడుతుంటాడు. మరి ఎంతో బలవంతుడైన సిద్ధార్థ్అభిమన్యుని ధృవ ఎలా ఎదిరించాడు? అతని వెనుక ఉన్న వందమంది క్రిమినల్స్ఆట ఎలా కట్టించాడు? కథలో ఇషిక(రకుల్ప్రీత్సింగ్‌) ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: 
ఇందులో కథ కంటే కథనానిదే పెద్దపీట. ‘నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చుఅనే సూత్రాన్ని నమ్మిన యువ ఐపీఎస్అధికారి, బలమైన శత్రువుని ఎంచుకొని అతని ఆట కట్టించడమే సినిమా కథ. బలమైన శత్రువుని ఎదుర్కొనే క్రమమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక సాదాసీదా కథకి, శక్తిమంతమైన కథనాన్ని జోడించారు. దీంతో ప్రతి సన్నివేశం ఎత్తులు పైఎత్తులతో సాగుతుంది. తొలి సగభాగం సినిమా కథానాయకుడు తన శత్రువుని ఎంచుకొని, అతని డెన్లోకి అడుగుపెట్టే సన్నివేశాలతో తీర్చిదిద్దారు. మలి సగభాగం కథంతా శత్రువుకి, కథానాయకుడికి మధ్య మైండ్గేమ్తో సాగుతుంది. రీమేక్సినిమా తీస్తున్నప్పుడు కథలో ఫీల్మిస్కాకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. కానీ సినిమాలో కొన్ని చోట్ల అది మిస్సయినట్లు కనిపిస్తుంది. అరవింద్స్వామి పాత్ర ప్రవేశించాక సినిమా వేగం పుంజుకొంటుంది. తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన చిత్రం కాబట్టి దాన్ని చెడగొట్టకూడదనో, మరేంటో తెలియదు కానీ... ఎక్కువ సన్నివేశాలుతని ఒరువన్లో ఉన్నట్టుగానే తీర్చిదిద్దారు దర్శకుడు. అయితేఅష్టదిగ్బంధనంకాన్సెప్ట్ను బాగా ప్లాన్చేశారు. సినిమా మాత్రం మంచి యాక్షన్థ్రిల్లర్ని చూసిన అనుభూతికి గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే?: 
రామ్చరణ్యువ ఐపీఎస్అధికారిధృవపాత్రలో స్టైలిష్గా కనిపిస్తూనే పాత్రలో ఒదిగిపోయాడు. రకుల్ప్రీత్సింగ్అందంగా కనిపించింది తప్ప నటించడానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. పరేషానురా... పాటలో ఆమె అందచందాలు కుర్రకారుకి కిక్కెక్కించేలా ఉంటాయి. అరవింద్స్వామి పాత్ర సినిమాకి కీలకం. ఆయన స్టైలిష్విలన్గా చక్కగా నటించారు. ద్వితీయార్ధంలో ఆయనపైనే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. అరవింద్స్వామి తండ్రిగా పోసాని కనిపిస్తారు. రామ్చరణ్స్నేహితుల్లో ఒకరిగా నవదీప్కనిపిస్తారు. తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు నవదీప్‌. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. సురేందర్రెడ్డి సాంకేతికంగా సినిమాని తనదైన శైలి స్టైలిష్మేకింగ్తో తీర్చిదిద్దారు. పి.ఎస్‌.వినోద్ఛాయాగ్రహణం, హిప్హాప్తమిళ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
బలాలు 
+నటీనటులు
+రామ్చరణ్లుక్
+కథనం
+సంగీతం
+ ఛాయాగ్రహణం
బలహీనతలు 
-అక్కడక్కడ సన్నివేశాల్లో సాగతీత
చివరిగా:  మాస్యాక్షన్థ్రిల్లర్‌... ధృవ 

రేటింగ్ : 4/5





Saturday, 26 November 2016

‘జయమ్ము నిశ్చయమ్మురా’ రివ్యూ చూసేయండి !!

                                                దర్శకత్వం : శివ రాజ్ కనుమూరి
                                  నిర్మాత : శివ రాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
                                                     సంగీతం : రవిచంద్ర
                                         నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ
‘గీతాంజలి’ సినిమాతో హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ అందుకున్న కమెడియన్ ‘శ్రీనివాస్ రెడ్డి’ మరో ప్రయత్నంగా చేసిన చిత్రమే ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. టీమ్ భారీ ప్రమోషన్ల మధ్య, మంచి పాజిటివ్ టాక్ మహద్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఏందో ఇప్పుడు చూద్దాం… రివ్యూ చూసేయండి 
కథ :
సర్వ మంగళం (శ్రీనివాస్ రెడ్డి) తెలంగాణలోని కరీంనగర్ నుండి కాకినాడ ఉద్యోగరీత్యా వచ్చిన ఒక పల్లెటూరి వ్యక్తి. మూఢనమ్మకాలను, స్వామిజీలను ఎక్కువగా నమ్మే సర్వమంగళం కాకినాడలో రాణి (పూర్ణ) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయించుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ పని మీదే ఉంటాడు.
కానీ ఇంతలోనే రాణి తనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల ప్రభావం వలన సర్వమంగళం తన చుట్టూ ఉన్న రాణికి దగ్గరవలేక, ఆ క్లిష్ట పరిస్థితుల్లో వదిలి వెళ్లలేక నానా అవస్థలు పడుతుంటాడు. అలా మానసిక సంఘర్షణలో ఉన్న సర్వమంగళం రాణిని ఎలా కాపాడుకున్నాడు ? ఎలా తన ప్రేమను రాణికి చెప్పాడు ? చివరికి తన లక్ష్యమైన ట్రాన్ఫర్ ను పొందాడా లేదా ? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్లస్ పాయింట్స్ కొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు ఎంచుకున్న సాధారణమైన స్టోరీ లైన్ , దాని చుట్టూ కథను అల్లుకున్న తీరుని గురించి చెప్పాలి. డైరెక్టర్ శివ రాజ్ రోజువారీ జీవితంలో మనకు కనబడే ఒక పిరికి పాత్రను తీసుకుని ఆ పాత్రను కష్టమైన పరిస్థితుల ప్రభావంలో ఇరికించి చివరికి దాన్నే హీరోని చేసిన తీరు, ఎక్కడికక్కడ ప్రేక్షకుడికి సంతృప్తినిచ్చే మలుపుల్లాంటి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే కథను మొత్తాన్ని కరీంనగర్, కాకినాడల్లోనే నడుపుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా లోకేషన్లని తెలివిగా వాడుతూ ఆహ్లాదకరంగా సినిమాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.
అలాగే ఫస్టాఫ్, సెకాండాఫ్ లలో పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని చేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కృష్ణ భగవాన్ చేత చేయించిన కామెడీ ఆద్యంతం రంజింపజేసింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో పోసాని కామెడీ బాగా కనెక్టయింది. అలాగే నటుడు శ్రీనివాస్ రెడ్డి ఒక మూఢనమ్మకాలను కలిగి ఆత్మవిశ్వాసం లేక వెనకబడుతున్న మంచివాడిగా తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ పూర్ణ కూడా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి స్వయం కృషితో బ్రతకాలనుకునే అమ్మాయిగా మెప్పించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్టాఫ్ ను బాగానే మొదలుపెట్టినా మొదటి 20 నిముషాల తరువాత కథ చాలా నెమ్మదించింది. దర్శకుడు చాలా సేపటి వరకూ అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం ముందు వరకూ బోర్ కొట్టించాడు. అలాగే సినిమాలో సర్వమంగళం పాత్ర చుట్టూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు నడిచి కాస్త విసిగించాయి.
ఇక సెకండాఫ్ లో కూడా సర్వమంగళం పాత్ర పూర్తిగా మారిపోయిన తరువాత వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు, పాత్రలు కథను కాస్త పక్కదారి పట్టించాయి. సర్వమంగళం పాత్ర పూర్తిగా హీరోగా మారిపోయే కీలకమైన సందర్భం బలంగానే ఉనప్పటికీ ఆ సన్నివేశం ప్రభావితంగా స్క్రీన్ పై చూపబడలేదు.
సాంకేతిక విభాగం :
నవలా ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు కథను, దానికి తగినంత కామెడీని కలుపుకుని కథనం రాసుకున్న దర్శకుడి రచనా ప్రతిభ, ఫస్టాఫ్ లో, సెకండాఫ్ లలో కథనం కాస్త నెమ్మదించినా దాన్ని తెరక్కించిన ఆయన దర్శకత్వ తీరు బాగున్నాయి. చాలా సన్నివేశాల్లో డైరెక్టర్ ప్రతిభ, సునిశిత పరిశీలన స్పష్టంగా బయటపడ్డాయి. ఇక కాకినాడ, భీమిలీ లొకేషన్లను అద్భుతంగా చూపించిన కెమెరా పనితనాన్ని మెచ్చుకోవలసిందే.
రవిచంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని అన్ని పాత్రలకు ముఖ్యంగా పోసాని, కృష్ణ భగవాన్ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. ఇక నిర్మాతగా కూడా వ్యవహరించిన శివరాజ్ కనుమూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం నిజ జీవితంలోని ఒక పాత్ర చుట్టూ తెలివిగా అల్లిన కథ, కథనాలతో సాగిపోయే సరదా చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల నటన ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ కథనం చాలా వరకూ సాగదీయబడి నెమ్మదించడం, సెకండాఫ్ కథ కాస్త దారి తప్పడం, అనవసరమైన సన్నివేశాలు ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద ఈ చిత్రం వాస్తవిక కథలను, కామెడీ ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడుతూ కాస్త నెమ్మదించిన కథనాన్ని అంగీకరించగల ప్రేక్షకులకు ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది.
రేటింగ్ :3/5