Wednesday, 16 November 2016

"ఆర్టిఫిషియల్ లవ్" తెలుగు లఘు చిత్రం బై "Mathew bro" ఎంత వరకు అలరించిందో మీరే చూడండి !!

చక్కని కాన్సెప్ట్ తో మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటున్న" ఆర్టిఫిషియల్ లవ్" లఘు చిత్రం.కాలం తో పాటు మనిషి మారుతూ ఒచ్చాడు ,ఎంతలా మారిపోతున్నారు అంటే విడిపోవటానికి కారణాలు చెప్పిన రోజులలోనుంచి,అయినా కలిసి ఉండటానికి కారణాలు కావాలి కానీ విడిపోవటానికి కారణాలు ఎందుకు చెప్పు అనే అంతగా మారిపోతున్నారు.చాలా మంది అంటూ ఉంటారు గతం గురించి ఎందుకు ప్రెసెంట్ మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం అని.లైఫ్ చాలా చిన్నది అని ఆ చిన్న లైఫ్ లో కంప్రోమైస్ అయి బ్రతకటం కంటే ఇష్టం వచ్చినట్టు హ్యాపీ గా బ్రతకటం మంచిది అని.ఆత్మాభిమానం అనే పేరుతో కుంతమంది ,ఇగో  ఫీలింగ్స్ తో మరికుంత మంది,అంతకు ముందు లాగా నువ్వు లేవు అనే నెపం తోటి .ఏవి అయితే ఏంటి .ఈ రోజులలో కారణాలు కూడా చెప్పాలా ....ఒకప్పుడు నువ్వు అంటే ఇష్టం ఇప్పుడు ఇష్టం లేదు అంతే అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందినే చూస్తున్నాం.
 అంతా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అనుకునే ఈ ఫాస్ట్ యుగం లో ఆకరికి పేస్ బుక్  పాస్ వర్డ్ చెప్పను అని విదిపోయిన భార్య బర్తలను చూస్తున్నాం.ఇంకా ఎనెన్ని చూడాలిసి వస్తుందో .ఆ పాత రోజులే బావున్నాయి అనిపించక మానదు.టెక్నాలజీ యుగం లో కొత్త విప్లవం" ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ " సింపుల్ గా రోబో  సినిమా చూసే ఉంటారుగా అలా ఒక మెషిన్ లేదా ఒక ప్రోగ్రాముడ్ డివైస్ తో మనిషి తో ఎలా మాట్లాడుతామో అలా మాట్లాడటం అనమాట.ఆ రోజులు కూడా వస్తాయి ఏమో అనిపిస్తోంది .ఇక పోతే ఈ చిన్న లఘు చిత్రం లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేసారు .ఉన్న జుట్టు పోతే ఏంటి కొత్త జుట్టు వస్తుంది అన్నట్టు .ఉన్న ప్రేమ పోతే ఏంటి నిన్ను వెతుకుంటూ కొత్త ప్రేమ వస్తుంది లైఫ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు.ఎంత వరకు అలరించిందో మరి మీరే చూడండి !!

No comments:

Post a Comment