Friday, 22 April 2016

శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రపై సినిమా!!

శ్రీనివాస రామానుజన్  అంటే మన దేశంలో అందరికి తెలుసు ....



ముక్యంగా  చదువుకున్న వాళ్లకి ,ఉపాధ్యయులకు,విద్యార్దులకు  ఆయన పేరు సుపరిచితమే .. 
భారత  దేశం గొప్పగా చెప్పుకోగలిగిన ప్రపంచ గణిత మేధావి ఆయన ,మరి ఆ మహనీయ గణిత శాస్త్రవేత్త గురించి భావి తరాల వారికి తెలియజేసే విధంగా మన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏమిటి ?

మహా  అయితే  ఆయన పుట్టిన రోజున డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్యవం జరుపుకుంటాం ,అయితే శ్రీనివాస రామానుజన్ గురించిన సమగ్రమైన సమాచారం కేంద్ర ప్రభుత్యం వద్ద కానీ , మన దేశపు ప్రముకమైన  గణిత క్లబ్ ల వద్ద కానీ ఉన్నదా ??
ఇవి సరైన సమాధానం దొరకని ప్రశ్నలు అసలు ఆయన జీవితం ,వారి గణిత పరిశోధన గురించి లోతైన పరిశిలన మన ప్రభుత్వాలు జరిపించాయో లేదో తెలియదు .. 

అయితే మనకు ఈ అద్భుతమైన అవకాశాన్ని హలీవుడ్ కల్పించింది ... అవును శ్రీనివాస రామానుజన్ గారి జీవితం ,వారి గణిత మేధా శక్తి ,గణిత పరిశోధనలు ,వారి జీవిత కష్టాలు ,ఎదుర్కున్న చీత్కారాలు మరియు పొందిన సత్కారాలు మొదలైన వివరాలతో ఓ చిత్రం రూపొందించారు . 
  THE MAN WHO KNEW INFINITY అనే పేరు తో ఇంగ్లాండ్ ,యూరోప్  దేశాలలో ఇప్పటికే విడుదల అయింది ,కలెక్షన్ వర్షం కురిపించింది . 
  అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ... 
శ్రీనివాస రామానుజన్ గురించి విదీశియులకి తెలిసినంత విషయాలలో సగం కూడా భారతీయులకి మారీ ముక్యం గా తమిళులకి తెలియకపోవటం ఎంత అయిన బాధ పడాలిసిన విషయం . 
ఇప్పటికే హాలివుడ్ లో చూసిన చాల మంది భారతీయులు శ్రీనివాస రామానుజన్  ఇంతటి గొప్పవాడా .... ఆయన జీవితం లో ఇన్ని మలుపులు ఉన్నాయా అని ఆశ్చర్య పోతున్నారు 
భారత దేశం లో ఈ చిత్రం ఏప్రిల్ 26 న విడుదల అవుతుంది . 

No comments:

Post a Comment