ఫుల్ లెంగ్త్ మూవీ కి ఏ మాత్రం తీసిపోకుండా చక్కగా చిత్రీకరించిన విధానం కి మెచ్చుకోక తప్పదు.అబ్బాయిలు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అసలు టెన్షన్ పడరేమో కానీ ఒక అమ్మాయి ముందుకు వెళ్లి ప్రేమిస్తున్నా నిన్ను అని చెప్పటానికి చాల రకాలుగా టెన్షన్ పడతారు.అబ్బాయిలు అమ్మాయి ని ప్రేమించిన తరువాత ఆ అమ్మాయి ని ఇంప్రెస్స్ చేయటానికి చాలా మార్గాలు అన్వేషిస్తారు,ఎవరి రూట్ వారిది అయితే అదంతా ఫైనల్ గా ఆ అమ్మాయి తో నువ్వు అంటే నాకు ఇష్టం నిన్ను ప్రేమిస్తున్న అనే మాట చెప్పించటం కోసమే.ప్రేమించేటప్పుడు తను ప్రేమించే అబ్బాయి లేక అమ్మాయి ఏం చేసిన నచ్చుతుంది ఎలా ఉన్న అద్బుతం గా ఉంటుంది అదే ప్రేమించిన తరువాత తను నాతోనే ఉండాలనో ,నాతోనే సమయం కేటాయించాలనో ,అలా ఎందుకు వున్నావ్ ఇలా ఎందుకు ఉన్నావ్ అని .తన మీద అతి ఇష్టం తో మనకి తెలీకుండానో లేక తెలిసో రిస్ట్రీకట్ చేస్తాం.ఎవరో ఏదో మనం ప్రేమించిన వారిని అనుకుంటే బాధ పడి అది మల్లి ప్రేమించిన వారి మీదే చూపిస్తాం .రిలేషన్ షిప్ కి ముందు ఏం చేసిన నచ్చినప్పుడు అదే రేలషన్ షిప్ లో ఉన్నప్పుడు నచ్చాలి కదా అనటం తప్పే అవుతుంది. ఫుల్ లెంగ్త్ సినిమా కి తీసి పోకుండా తీసిన ఈ లఘు చిత్రం ఎంత వరుకు ఆకట్టుకుందో మీరే చూడండి !!




No comments:
Post a Comment